calender_icon.png 13 November, 2025 | 4:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూజసామగ్రి, టెంకాయల విక్రయానికి బహిరంగ వేలంపాట

13-11-2025 12:00:00 AM

ఇబ్రహీంపట్నం, నవంబర్ 12: మున్సిపల్ కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నందు టెంకాయలు, పూజ సామాగ్రి విక్రయించేందుకు ఈ నెల 21న బహిరంగ వేలం పాట ఉంటుందని దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్య నిర్వహణ అధికారి దేవరశెట్టి ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు .

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కొబ్బరి కాయలు,పూజ సామాగ్రి విక్రయించేందుకు టెండర్ ఉంటుందని,ఈ బహిరంగ వేలం పాటలో పాల్గొనదలచిన వారు ఒక గంట ముందు 5వేల రూపాయలు ధరావత్తు సొమ్ము నగదు రూపంలో చెల్లించి వేలం పాటలో పాల్గొనాలని, అయితే వేలం దక్కించుకున్న వారు కాకుండా మిగతా సభ్యులందరికీ ధరావత్తు సొమ్ము వెంటనే తిరిగి ఇవ్వబడుతుందని అన్నారు. బహిరంగ వేలం పాట 21-11-25 న శుక్రవారం ఉంటుందని వేలం పాట  కాలపరిమితి 01-12-25 నుండి 30-11-26 వరకు సంవత్సర కాలం ఉంటుందని తెలిపారు. వేలం పాటలో పాల్గొన దల్చిన వ్యక్తులు మరిన్ని వివరాల కొరకు ఆలయ ఈవో అధికారి 9866142822 నెంబర్ ను సంప్రదించాలని కోరారు.