04-02-2026 12:41:51 AM
ఎక్సైజ్ ఆఫీస్ ముందే మందుబాబు నిద్ర
కళ్లముందే ఉన్న స్పందన శూన్యం
ఎక్సైజ్ శాఖ పనితీరుపై ప్రజల్లో తీవ్ర అందోళనలు
ములుగు, ఫిబ్రవరి3 (విజయక్రాంతి): ములుగు జిల్లా కేంద్రంలో ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యానికి అద్దం పట్టే ఘటన తీవ్ర చర్చనీ యాంశంగా మారింది. జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయం-ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఓ వ్యక్తి మద్యం మత్తులో గంటల తరబడి స్పృహ లేకుండా పడిపోయినా అధికారులు పట్టించుకోకపోవడం స్థానికులను విస్మయానికి గురిచేసింది. మంగళవా రం ఉదయం నుంచే సదరు వ్యక్తి ఎక్సైజ్ కార్యాలయం మెట్ల మార్గంలో మత్తులో నిద్రపోతూ కనిపించాడు. ప్రభుత్వ కార్యాల యం ముందు ఇలాంటి పరిస్థితి ఉన్నా, కార్యాలయంలో సిబ్బంది ఉన్నప్పటికీ క నీసం స్పందించకపోవడం విమర్శలకు దారి తీసింది. ప్రజల రాకపోకల మధ్య ఈ దృశ్యం కనిపించడంతో స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
నాటు సారా నిర్మూలన, అక్రమ మద్యం నియంత్రణ ప్రధాన బాధ్యతగా వహించాల్సిన ఎక్సెజ్ శాఖ కార్యాలయం ముందే మద్యం మత్తు ఘటన జరగడం విరోధాభాసంగా మారింది. సదరు వ్యక్తి నాటు సారా సేవించి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నా, కనీస విచారణ కూడా జరగకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది.ఎక్సెజ్ ఆఫీస్ ముందే ఇలాంటి దృశ్యం కనిపిస్తే ఇక గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల భద్రత, చట్ట అమలుపై పర్యవేక్షణ వహించాల్సిన అధికారులు ఈ స్థాయిలో నిర్లక్ష్యం ప్రదర్శించడం తగదని వారు మండిపడుతున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికా రులు వెంటనే స్పందించి బాధ్యులపై చర్య లు తీసుకోవాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎక్సెజ్ శాఖ ఈ వ్యవహారాన్ని ఎలా తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.