భర్తను హతమార్చిన భార్య
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కేంద్రంలోని గోసంగి కాలనీలో కోదండం లక్ష్మి భర్త శివాజీ నివాసముంటున్నారు. గత కొంతకాలంగా భార్య భర్తల మధ్య గొడవలు జరుతుగున్నాయి. నిత్యం శివాజీ తాగి వచ్చి భార్యతో గొడవ పడుతు చిత్రహింసలకు గురి చేయడంతో భర్తపై విసుగుచెందిన భార్య లక్ష్మి తన భర్తను కడ తీర్చేందుకు సిద్ధమైంది. శనివారం రాత్రి పడుకొని ఉన్న భర్తపై కొడవలితో దాడి చేసి హత్య చేసింది. స్థానికుల ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మృతదేహాన్ని స్వాథీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భర్తను హత్య చేసిన భార్య లక్ష్మిని స్థానికులు దేహశుద్ధి చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని, నిందితురాలని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.






