ఆటో అదుపుతప్పి ఇద్దరు మహిళలు మృతి.. ముగ్గురికి గాయాలు
26-04-2026 11:20 AM
సదాశివపేట: సదాశివపేట మండలం నందికంది సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి డివైడర్ను డి కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో న్యాల్కల్ మండలానికి చెందిన లావణ్య, మనూర్ మండలానికి చెందిన రుక్మిణి, అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.






