calender_icon.png 28 November, 2025 | 3:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ ఫెలోషిప్ జాతీయ అవార్డుకు పుల్ల ప్రతాప్ ఎంపిక

28-11-2025 03:00:17 PM

చిట్యాల(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలకేంద్రానికి చెందిన పుల్ల ప్రతాప్ అంబేద్కర్ ఫెలోషిప్ నేషనల్ అవార్డ్ కు ఎంపికైనట్లు కాకతీయ దళిత సాహిత్య అకాడమీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జితేందర్ మను ఓ ప్రకటనలో తెలిపారు.గత 15 సంవత్సరాలుగా పుల్ల ప్రతాప్ అంబేద్కర్ ఆశయాల కొరకు కృషి చేస్తూ, కళారంగాల్లో గాయకుడిగా రచయితగా సమాజంలో జరుగుతున్న అనేక విషయాలపై ప్రత్యేక కృషి చేసినట్లు తెలిపారు.

సేవలను గుర్తించి కాకతీయ దళిత సాహిత్య అకాడమీ అవార్డు ఎంపిక చేయడం జరిగిందనీ అన్నారు ఢిల్లీలో పంచశీల ఆశ్రమంలో జరగబోయే 41 వ జాతీయ అంతర్జాతీయ సదస్సులో డిసెంబర్ 12న జాతీయ అంతర్జాతీయ ప్రముఖులచే ఈ అవార్డును అందిస్తున్నట్లు డాక్టర్ జితేందర్ మను తెలిపారు. పుల్ల ప్రతాప్ మాట్లాడుతూ సేవలను గుర్తించి అంబేద్కర్ ఫెలోషిప్ జాతీయ అవార్డుకు ఎంపిక చేసినందుకు కాకతీయ దళిత సాహిత్య అకాడమీ తెలంగాణ రాష్ట్ర ఆధ్యక్షులు డాక్టర్ జితేందర్ మను గారికి కృతజ్ఞతలు తెలుపారు.