calender_icon.png 28 November, 2025 | 3:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాత్మ జ్యోతిరావు పూలేకు ఘన నివాళులు

28-11-2025 02:58:41 PM

బెల్లంపల్లి, అర్బన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కాంట అంబేద్కర్ చౌరస్తా వద్ద శుక్రవారం బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతినీ నిర్వహించారు. జిల్లా ఇన్చార్జి దాగం శ్రీనివాస్,జిల్లా ఇంచార్జ్ నాగుల కిరణ్ బాబు, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్,మహాత్మ జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పూలే సేవలను కొనియాడారు. సమాజ శ్రేయస్సు కోసం తన సర్వసం ధారపోశాడన్నారనీ,ఆయన ఆశయ సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్, మందమర్రి పట్టణ అధ్యక్షులు గాజుల శంకర్, మండలం అధ్యక్షులు రహీం బాబా, నాయకులు తాటిపెల్లి అభిలాష్,అంగూరి సుభాష్ తదితరులు పాల్గొన్నారు.