28-11-2025 03:02:37 PM
నకిరేకల్,(విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న సిపిఎం(CPM), బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి(CPM District Secretary Tummala Veera Reddy) కోరారు. శుక్రవారం నకిరేకల్ నర్రా రాఘవరెడ్డి భవనంలో నిర్వహించిన సిపిఎం మండల కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలిచే వారికి ప్రజలు ఆశీర్వాదం ఇవ్వాలని, ధనబలం కాదు ప్రజాబలం ముఖ్యమని అన్నారు.
అభివృద్ధి,సంక్షేమ పనుల కోసం పోరాడే కమ్యూనిస్టు కార్యకర్తలను ఎన్నుకోవడం ద్వారా గ్రామాల అభివృద్ధికి బాటలు వేయాలని సూచించారు.ఎన్నికల్లో ఓటర్లు ప్రలోభాలకు లోనుకాకుండా, ప్రజల కోసం పనిచేసే మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని ఆయన అభిలషించారు.ఈసమావేశంలో ఆపార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల, మండల కార్యదర్శి రాచకొండ వెంకట్ గౌడ్, టౌన్ కార్యదర్శి ఒంటెపాక వెంకటేశ్వర్లు, మండల కమిటీ సభ్యులు ఆకుల భాస్కర్, చాకుంట్ల నరసింహ, చిన్నబోయిన నాగమణి, అక్కెనపల్లి సైదులు, ఒంటెపాక కృష్ణ, కొప్పుల అంజయ్య, లక్ష్మీ, నరసయ్య, జిల్లా ఉపేందర్, పాలడుగు పరమేష్, బండమీది ఎల్లయ్య, వెంకట రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.