మండల సమస్యలపై మంత్రి కోమటిరెడ్డిని కలిసిన గుమ్మడి
ఇల్లెందు, జూన్ 23,(విజయక్రాంతి): ఇల్లందు మండలంలోని గ్రామ పంచాయతీలలో నెలకొన్న సమస్యలపై ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య ఆధ్వర్యంలో కొమరారం సర్పంచ్ అజ్మీర బిచ్చ, మాస్ లైన్ పార్టీ రాష్ట్ర నాయకులు చిన్నచంద్రన్న, నాయిని రాజన్నలతో రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నివాసంలో కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య సమస్యల గురించి వివరిస్తూ, గత కొన్ని సంవత్సరాలుగా కొమరారం, పోచారం, బోయితండా, కొమ్ముగూడెం గ్రామ పంచాయతీలలో సీసీ రోడ్లు, డ్రెయిన్లు(సైడ్ కాలువలు) లేకపోవడం, అట్లాగే కొమరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రహరీ నిర్మాణం, కొమరారం హైస్కూల్ ప్రహరీ నిర్మాణం లేక స్థానిక ప్రజలు విద్యార్థులు ఎన్నో ఆగచాట్లు ఇబ్బందులు పడుతున్నారనీ, అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా వర్షాకాలం ప్రారంభం అవుతుంది
కాబట్టి ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతం కనుక సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మంత్రికి వివరించారు. మంత్రి వెంటనే స్పందించి స్థానిక జిల్లా కలెక్టర్ కి కొమరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రహరీ మంజూరు చేయమని తన స్వంత లెటర్ హెడ్ పై సిఫారసు లెటర్ రాసి ఇచ్చారని తెలిపారు. అట్లాగే ఇంకా తన దృష్టికి తీసుకెళ్లిన సమస్యలన్నింటినీ కూడా సంబంధిత శాఖల అధికారులతో చర్చించి, పరిశీలన చేసి త్వరితగతిన పరిష్కారం చేస్తానని హామీ చారని తెలిపారు.






