11 May, 2026 | 3:10 AM

పంజాబ్ గెలుపు బాట పట్టేనా?

11-05-2026 01:56 AM

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్

గెలిస్తే టాప్ ప్లేస్

ధర్మశాల, మే 10 : ఐపీఎల్ 19వ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ కీలక పో రుకు సిద్ధమైంది. సీజన్ సెకండాఫ్ లో తడబడుతున్న పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడబోతోంది. ధ ర్మశాల వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.  ఆరంభంలో వరుస విజ యాలతో అదరగొట్టి టాప్ ప్లేస్‌లో నిలిచిన పంజాబ్ కింగ్స్ 10 మ్యాచ్ లలో ఆరు గెలిచిన 13 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇప్పుడు ఢిల్లీపై గెలిస్తే పాయింట్ల పట్టికలో టాప్‌ప్లేస్‌కు దూసుకెళుతుంది. సన్ రైజర్స్‌పై పంజాబ్ ఓటమికి బ్యాటింగ్ వైఫల్యం తో పాటు ఫీల్డింగ్ తప్పిదాలే కారణం. 

దీనిపై కోచ్ రికీ పాంటింగ్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఫీల్డింగ్ మెరుగుపడకుంటే మాత్రం పంజాబ్‌కు ఇబ్బందే. అటు బ్యాటిం గ్‌లో ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, స్టోయినిస్ గత మ్యాచ్‌లో విఫలమయ్యారు. కూపర్ కన్నోలీ సెంచరీతో చెలరేగినా మిగిలిన బ్యాటర్ల వైఫల్యంతో ఓటమి తప్పలేదు. దీంతో బ్యాటర్లు కూడా గాడిన పడాల్సిన అ వసరం ఉంది. బౌలింగ్‌లో మార్కో జెన్సన్, విజయ్ కుమార్ వైశాక్ తో పాటు ఫెర్గ్యుసన్, అర్షదీప్ సింగ్ పర్వాలేదనిపిస్తున్నారు.

చాహల్ స్పిన్నర్‌గా రాణిస్తున్నాడు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కథ దాదాపుగా ముగిసినట్టే. ఇప్పటి వరకూ 11 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ కేవ లం నాలుగే గెలిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉన్న ఆ జట్టు మిగిలిన మూడింటిలో గెలిచినా కూడా ప్లే ఆఫ్స్ చేరడం కష్టమే. ఎందుకంటే నెగెటివ్ రన్ రేట్ ను బాగా మెరుగుపరుచుకోవాలంటే మూడు మ్యాచ్ లలో భారీ విజయాలను అందుకోవాలి. 

తుది జట్లు అంచనా 

పంజాబ్ కింగ్స్ : ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్, కూపర్ కన్నోలీ, శ్రేయాస్ అయ్యర్, స్టోయినిస్, సూర్యవంశీ, శశాంక్ సింగ్, మార్కో జెన్సన్, విజయ్ కుమార్ వైశాఖ్, ఫెర్గ్యూసన్, అర్షదీప్

ఢిల్లీ క్యాపిటల్స్: రాహుల్, నిస్సాంక, నితీశ్‌రాణా, స్టబ్స్, అక్షర్, రిజ్వీ, అశుతోష్ శర్మ, నిగమ్, స్టార్క్, ఎంగిడి, ముకేశ్ కుమార్