11 May, 2026 | 3:10 AM

కెప్టెన్సీ గురించి ఆలోచించలేదు

11-05-2026 01:54 AM

చెన్నై సారథ్యంపై సంజూ వ్యాఖ్యలు

రుతురాజ్‌పై ప్రశంసలు

చెన్నై, మే 10: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీకి సంబంధించి వస్తున్న ఊహాగానాలకు సంజూ శాంసన్ చెక్ పెట్టాడు. ట్రేడింగ్‌లో రాజస్థాన్ రాయల్స్ నుంచి సీఎస్కేకు వచ్చినప్పుడు సంజూకే సారథ్య బాధ్యతలు అప్ప గిస్తారని ప్రచారం జరిగింది. కానీ రుతురాజ్ గైక్వాడ్ నే చెన్నై సారథిగా కొనసాగించింది.

తాజాగా దీనిపై సంజూ శాంసన్ స్పందించా డు. తాను ఎప్పుడూ కెప్టెన్సీ గురించి ఆలోచించలేదని తెలిపాడు. కొత్త జట్టులోకి వెళ్లేట ప్పుడు డిమాండ్లతో వెళ్లకూడదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కొత్త ఇంట్లోకి వెళ్తే ముందుగా ఆ ఇంటి మనిషిలా కలిసిపోవాలని వ్యాఖ్యానించాడు.  ప్రస్తుత చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వ్పా సంజూ ప్రశంసలు కురిపించాడు.