ఎలాన్ మస్క్ పై పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు
17-06-2024 04:48 PM
అమరావతి: ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చన్న ఎలాన్ మస్క్ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించారు. మస్క్ ను ఎన్నికల సంఘం భారత్ కు ఆహ్వానించాలని ఈవీఎం హ్యాకింగ్ నిరూపణకు ఆయనకు అవకాశమివ్వాలన్నారు. ఇప్పటి వరకు ఈవీఎంలపై పరిశోధనలకు ఈసీ చాలా మందికి అవకాశం ఇచ్చిందని ఆమె చెప్పారు. ఈసీ అవకాశాలిచ్చినా ఎవరూ హ్యాక్ చేయలేకపోయారని పురందేశ్వరి పేర్కొన్నారు.






