1 August, 2026 | 9:10 PM

వెయ్యికి పైగా కొత్త బస్సుల కొనుగోలు

24-08-2024 02:46 AM

ఆర్టీసీ హైదరాబాద్, కరీంనగర్ జోన్ ఈడీ వినోద్‌కుమార్

గజ్వేల్, ఆగస్టు 23: రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన సేవలందించడానికి ఆర్టీసీ కార్పొరేషన్ వెయ్యికి పైగా కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు హైదరాబాద్, కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు. శుక్రవారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపోను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిపోలో కార్మికులు, ఉద్యోగుల పనితీరు, గ్యారేజీల నిర్వహణను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మహాలక్ష్మి పథకం అమలు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంత మహిళలు ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నారన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలం దించడానికి పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులను వెయ్యికిపైగా కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. గజ్వేల్‌ెేప్రజ్ఞాపూర్ డిపో ఉద్యోగులు రాఖీ పండుగ నేపథ్యంలో అంకిత భావంతో పనిచేసి రాష్ట్రస్థాయిలో మొదటిస్థానంలో నిలిచినందుకు అభినందించారు. డిపో మేనేజర్ పవన్‌తో కలిసి డిపో ఆవరణలో మొక్కను నాటారు.