సంక్షేమ ఫలాలు అర్హులకు చేర్చాలి
- అధికారులకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సూచన
- వికారాబాద్ జిల్లా అభివృద్ధిపై సమీక్ష
- త్వరలో భూమాత బిల్లు తెస్తామని వెల్లడి
వికారాబాద్, ఆగస్టు 23(విజయక్రాంతి): సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అర్హులైన ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత అధికారులపైనే ఉన్నదని అసెంబ్లీ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. శుక్రవారం వికారాబాద్ కలెక్టరేట్‌లో తెలంగాణ హక్కు ల రికార్డు బిల్లు ముసాయిదా బిల్లు, ఎల్‌ఆర్‌ఎస్‌పై అవగాహన కార్యక్రమంతో పాటు జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గడ్డం ప్రసాద్‌కుమార్ మాట్లాడు తూ.. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధి కృషి చేయాలని కోరారు.
రాబోయే ఐదు సంవత్సరాల్లో జిల్లా ఎంతగానో అభివృద్ధి చెందుతుందన్నారు. పరిశ్రమలు, విద్యారంగ అభివృద్ధితో పాటు రూ.400 కోట్లతో అనంతగిరిని అభివృద్ధి చేస్తామన్నారు. వర్షాల జరిగిన పంట నష్టం వివరాలు సేకరించి, నివేదికలు సమర్పించాలని స్పీకర్ అధికారులను ఆదేశిం చారు. త్వరలో భూమాత చట్టాన్ని తీసుకొస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, కలెక్టర్ ప్రతీక్ జైన్ పాల్గొన్నారు.






