12-11-2025 12:57:06 AM
ఎంపీ ధర్మపురి అరవింద్
జగిత్యాల అర్బన్, నవంబర్ 11 (విజయ క్రాంతి): కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశాన్ని ఏకం చేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ కు చెందిన మై భారత్ జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో స్వామి వివేకానంద మినీ స్టేడియం లో మంగళవారం యూనిటీ మార్చ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్ తో కలిసి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొని “ఉక్కు మనిషికి ఘన నివాళి” అర్పించారు.
ఈ సందర్భంగా ఎంపి అరవింద్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి వల్లనే ఈరోజు అఖండ భారతదేశం ఐకమత్యంగా ఉందని తెలిపారు. మహనీయుల జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తెలుసుకొని స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు. సర్దార్ పటేల్ కృషి వల్లె కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారతదేశం ఐక్యం గా ఉందన్నారు. ప్రధాన మంత్రి మోడీ పిలుపుమేరకు ప్రతి జిల్లాలో పాదయాత్రలు చేపడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ స్వామి వివేకానంద మినీ స్టేడియం లో పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్ర లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తో పాటు పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) బి. రాజ గౌడ్, ఆర్డీవో మధుసూదన్, డి వై ఎస్ ఓ జి. రవికుమార్ , ఎస్ కే ఎన్ ఆర్ ప్రిన్సిపాల్ డాక్టర్, ఏ. అశోక్ , సర్దార్ ట150 జగిత్యాల పాదయాత్ర ప్రోగ్రాం కన్వీనర్ పి. శ్రీనివాస్ , మేరా యువ భారత్ జగిత్యాల జిల్లా డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ ఎం. వెంకట రాంబాబు, మై భారత్ ప్రోగ్రాం అధికారి బి. రవీందర్, ఎన్‌ఎస్‌ఎస్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఆడెపు శ్రీనివాస్ వివిధ కళాశాలల అధ్యాపకులు, అధికారులు, ఎన్సీసీ విద్యార్థులు, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.