28 May, 2026 | 1:53 AM

కొనుగోలు వేగవంతం చేయాలి

28-05-2026 12:00 AM

కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి, మే 27 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్  ఆశీష్ సంగువాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాలో కొనసాగుతున్న వరి కొనుగోలు ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆకస్మికంగా పరిశీలించారు. బుధవారం కామారెడ్డి మండలంలోని ఉగ్రవాయి గ్రామంలో ఉన్న గురు రాఘవేంద్ర రైస్ మిల్ను తనిఖీ చేసి, ధాన్యం నిల్వలు, రవాణా , మిల్లింగ్ ప్రక్రియపై అధికారులతో సమీక్ష చేసి ప్రతి రోజు కనీసం 15 లారీల దాన్యం దించుకోవాలి అని మిల్లర్ లను ఆదేశించారు.అనంతరం శాబ్దిపూర్ వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. అనంతరం సదాశివనగర్ మండలంలోని అడ్లూరి ఎల్లారెడ్డి వరి కొనుగోలు కేంద్రం, శ్రీ మన్నారాయణ రైస్ మిల్లను పరిశీలించారు.అకాల వర్షాల కారణంగా జిల్లాలో సుమారు 1,100 మెట్రిక్ టన్నుల వరి పంట దెబ్బతిన్నట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు.

ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 3,78,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణ పూర్తయినట్లు తెలిపారు. ఇందులో ప్రస్తుతం 1,064 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలో ఉన్నట్లు పేర్కొన్నారు. వర్షాల వల్ల ధాన్యం తడవకుండా వెంటనే మిల్లులకు తరలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద నీరు నిల్వ ఉండకుండా కంధకం కాలువలు ఏర్పాటు చేయాలని, ధాన్యం కుప్పలను టార్పాలిన్లతో క్రింది నుండి పైకి, పైనుండి క్రిందకు కప్పి ఉంచాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ విక్టర్ ,సివిల్ సప్లయ్ అధికారి వెంకటేశ్వర్లు, సివిల్ సప్లై మేనేజర్ శ్రీకాంత్, తహశీల్దార్లు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.