22 May, 2026 | 7:43 PM

Breaking News

ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •   వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు బలి   •   పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మారినేని సుధీర్ రావు   •   వేతన పెంపు హర్షణీయం: మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్   •   కామారెడ్డి డిఆర్డిఓగా దామోదర్ రెడ్డి   •   దోమకాటు వ్యాధుల పట్ల... ప్రజలకు అప్రమత్తత అవసరం   •   సర్కారు భూముల్లో అక్రమ నిర్మాణాలను సహించేది లేదు   •  

పుష్కర ఘాట్లు పరిశీలన

10-09-2025 08:41 PM

జిల్లా కలెక్టర్ 

లక్షేట్టిపేట (విజయక్రాంతి): మున్సిపాలిటీలోని గోదావరి పుష్కర ఘాట్లను 2027 సంవత్సరంలో జరుగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకొని ప్రజల సౌకర్యార్థం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak), తహసిల్దార్ దిలీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్ కలిసి జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో గల గోదావరి నది తీరంలోని పుష్కర్ ఘాట్ ను మండల తహసిల్దార్ రఫతుల్లా తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గోదావరి నది తీరంలో సౌకర్యాల కల్పన దిశగా పుష్కర ఘాట్ల వద్ద పరిస్థితులను పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. గత పుష్కరాలలో గోదావరి నదిలో పుష్కర స్నానం చేసిన భక్తుల సంఖ్య, భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన స్టాళ్లు, త్రాగునీరు, తాత్కాలిక గదులు, వాహనాల పార్కింగ్ ఇతర ఏర్పాట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.