calender_icon.png 11 September, 2025 | 12:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉన్నత లక్ష్యాలను సాధించాలి

10-09-2025 08:46:50 PM

కరీంనగర్ క్రైమ్ (విజయక్రాంతి): విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిన సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని ఫాతిమా అడోరేషన్ సోసైటీ ప్రతినిధి సిస్టర్ జనే మేరీ అన్నారు. కరీంనగర్ లోని ఫాతిమా నగర్ అడోరేషన్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు 105 మంది నోట్ బుక్స్, డ్రెస్, బ్యాగ్స్, పెన్స్,పెన్సిల్, స్కేల్, తదితర సామాగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయోలా జూనియర్ కాలేజి ప్రిన్సిపాల్ ఫాదర్ అలెక్స్ హాజరై మాట్లాడుతూ.... చిన్నారులు బాగా చదివి నైతిక విలువలతో, క్రమశిక్షణతో కూడిన ఉన్నత విద్యను అభ్యసించి సమాజంలో మంచి పౌరులుగా గుర్తింపు పొందాలని సూచించారు. ఎంచుకున్న లక్ష్యం చేరే వరకు సాధన చేయాలని సూచించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమములో హార్టికల్చర్ డివిజనల్ అధికారి రోహిత్,సంస్థ కో ఆర్డినేటర్ సిస్టర్ దీప్తి, సంస్థ ప్రతినిధులు,మర్రి మల్లేశం, నరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రూప, రమేష్, స్రవంతి,మౌనిక, సరిత, జమున, మరియు పిల్లల తల్లి దండ్రులు పాల్గొన్నారు.