10-09-2025 08:37:50 PM
హనుమకొండ జిల్లాలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం
ఓబీసీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బీసీ మహిళా చైతన్య సదస్సు
హనుమకొండ (విజయక్రాంతి): తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మహిళ చైతన్య దీప్తి చాకలి ఐలమ్మ వర్ధంతి వరంగల్ నగరంలోని హనుమకొండ హరిత కాకతీయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. బుధవారం హనుమకొండ లోని హరిత కాకతీయ హోటల్ లో ఓబీసీ చైర్మన్ ఎస్. సుందర్ రాజ్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన చాకలి ఐలమ్మ వర్ధంతి సభకు మహిళలు, విద్యార్థులు, మేధావులు, కవులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలు పెద్దఎత్తున హాజరవడంతో ప్రాంగణం సాయుధ పోరాట నినాదాలతో హోరెత్తింది. భారీ ఎత్తున జరిగిన మహిళా చైతన్య సదస్సుకు మాజీ కూడా చైర్మన్, ఓబీసీ చైర్మన్ ఎస్. సుందర్ రాజ్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. సదస్సుకు ఓబీసీ ఉపాధ్యక్షురాలు డాక్టర్ టి. విజయలక్ష్మి అధ్యక్షత వహించగా ఓబీసీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా మేధావులు, ఉద్యోగులు, అధ్యాపకులు, సామాజిక ఉద్యమకారులతో కలిసి ఓబీసీ ఏర్పాటు చేశామన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం చాకలి ఐలమ్మ పోరాటం చేసిందనీ గుర్తు చేశారు.
చాకలి ఐలమ్మ స్పూర్తితో నేటి యువత, మహిళలు ఉద్యోగాల కోసం పోరాటం చేయాలి,మలిదశ తెలంగాణ పోరాటంలో త్యాగాలు చేసిన 1200 మందిలో 80 శాతం మంది బీసీలేనన్నారు.అయినా ప్రభుత్వ పాలసీల్లో బీసీలం ఉండటం లేదని,బీసీల్లో రాజకీయ చైతన్యం పెరగాలనీ పిలుపునిచ్చారు.అసెంబ్లీ ఎన్నికల్లో సగం సీట్లు బీసీలకు వచ్చేలా పోరాడాలని,రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ బిల్లు ప్రకారం పెరిగే సీట్లతో 153 స్థానాల్లో 51 మంది మహిళలు ఉండబోతున్నారన్నారు.51 మందిలో 26 సీట్లు బీసీ మహిళలు సాధించేలా కొట్లాడాలని మహిళలకు చెప్పారు.ప్రభుత్వం స్కాలర్ షిప్స్ ఇవ్వక బీసీ విద్యార్థులు నష్టపోతున్నారు.స్కాలర్ షిప్స్, ఉద్యోగాలు, ఎమ్మెల్యే సీట్లు సాధించేలా మహిళల్లో చైతన్యం రావాలనీ మాజీ కూడా చైర్మన్, ఓబీసీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చీకటి శారద, బైరి లక్ష్మి, రావుల కోమల, విజయశ్రీ, దాసోజు లలిత, డాక్టర్ నాగవాణి, డాక్టర్ రమ, అరుణ, లక్ష్మి,ఓబీసీ నాయకులు అరవింద్ స్వామి, ఎమ్ఎన్ మూర్తి, వేణుమాధవ్, సరిత, మౌనిక, భవాని, సరస్వతి, , పద్మజ, ప్రవళిక, శ్రావణి, షైన్, పల్లవి, శ్రీలత,విద్యార్థినిలు,మహిళలుతదితరులు పాల్గొన్నారు.