పుష్ప సరికొత్త రికార్డు

16-04-2024 05:34:04 PM

పుష్ప చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీని దక్కించుకున్న కథానాయకుడు అల్లు అర్జున్. ఈ చిత్రంలో తన నటనకు ఉత్తమ కథానాయకుడిగా జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా పుష్పకు సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం పుష్ప సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇటీవల అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్‌లో అమ్మవారి గెటప్‌లో బన్నీ అందర్ని ఆకట్టుకున్నాడు. టీజర్ విడుద లైనప్పటి నుండి కంటిన్యూగా 138 గంటల పాటు టీజర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్ వన్ లో కొనసాగుతుంది. 110 మిలియన్ల వ్యూస్‌తో పాటు 1.55 మిలియన్ల లైక్స్‌తో సరికొత్త రికార్డు సృష్టించింది. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.