పుట్ట మధు.. మతిలేని మాటలు మానుకో..
కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి సెగ్గెం రాజేష్
మంథని, ఏప్రిల్ 23(విజయ క్రాంతి) విజ్ఞానవంతులైన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుదిళ్ళ శ్రీధర్ బాబు, టిపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు ల పై అవాకులు చవాకులు మాట్లాడడం మానుకోవా లని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సెగ్గం రాజేష్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధును హెచ్చరించారు. గురువారం ఆయన కాంగ్రె స్ నాయకులు తో కలిసి డివిజన్ ప్రెస్ క్లబ్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 20న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ విజయవంతం కావడానికి ఓర్వలేక ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం నీ అవివేకానికి నిదర్శ నమని ఆయన హితవు పలికారు. దొంగ నో ట్లు, సారా కాంట్రాక్టులు, కర్ర బిజినెస్, గం జాయి స్మగ్లింగ్ లు చేసిన నీకు ప్రజా క్షేత్రంలో మాట్లాడే హక్కు లేదన్నారు.
ఈ ప్రాంత అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తు న్న మంత్రి శ్రీధర్ బాబు అందరికీ ఆదర్శనీయుడని ఆయన పేర్కొన్నారు. విద్యావంతు డైన శ్రీధర్ బాబు హయంలో అనేక విద్యాసంస్థలు నెలకొల్పియారని విద్య లేని నీకు ఎలాంటి అవగాహన లేకుండా చిల్లర మాటలతో ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చే స్తున్నావని ఆయన ఎద్దేవ చేశారు. మా నా యకులు మంత్రి శ్రీధర్ బాబు, శ్రీను బాబుల గురించి తప్పుడు మాటలు మాట్లాడితే త్వరలోనే నీకు ఈత బరిగలతో దేహ శుద్ధి చేస్తామని ఆయన హెచ్చరించారు.
మా నాయకుడు మాకు సంయమనం పాటించమని చెప్పబట్టి మేము ఓపికతో ఉన్నామని మేము సహనం కోల్పోతే నీవు బయట తిరి గే పరిస్థితులు ఉండవని పుట్ట మధుకు సూ చించారు. సభ్యత సంస్కారం గురించి ఏమా త్రం తెలియని నీకు శ్రీధర్ బాబు శీను బా బుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నిటిని నిలబెట్టుకోవడానికి ఇంకా మూడు సంవత్సరాల సమయం ఉందని మీ నాయకుని పాలన మూలంగా రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం తలెత్తిందని ఆయన గుర్తు చేశారు.
అనంతరం ఆ రెందగ్రామ శాఖ అధ్యక్షుడు ఊట్ల అనిల్ రెడ్డి మాట్లాడుతూ 103 కోట్లతో బ్రిడ్జి నిర్మా ణ పనులు శ్రీధర్ బాబు చలువతో ప్రారంభమయ్యాయని తెలిపారు. అలాగే మీ బి ఆర్ ఎస్ ప్రభుత్వ హాయంలో రైతులకు నష్టపరిహారంగా 11 లక్షలు 50 వేలు ఇప్పిస్తా మని ఘోరంగా మోసం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు నాగుల రాజయ్య, ఈసంపల్లి శ్రీనివాస్, బ్లాక్ కాం గ్రెస్ అధికార ప్రతినిధి వేల్పుల రాజు, లక్కే పూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఈసంపల్లి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్, పాల్గొన్నారు.






