1 June, 2026 | 1:47 AM

సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం

01-06-2026 12:11 AM
  1. రోడ్డు వెడల్పు పనులు పరిశీలించిన విప్
  2. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ, మే 31(విజయక్రాంతి )నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా వేములవాడ పట్టణ అభివృద్ధికి కూడా సమాన ప్రాధాన్యం ఇస్తూ, రాజన్న ఆలయంలో సుమారు రూ.150 కోట్లతో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అందులో భాగంగా ఆలయం ముందు నుంచి బ్రిడ్జి వరకు 80 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులు చేపట్టినట్లు చెప్పారు. నిర్వాసితులు, దుకాణదారులు, పట్టణ పెద్దలు, ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ పనులు ముందుకు సాగుతు న్నాయని వెల్లడించారు.

ఈ రోడ్డుకు సంబంధించి సుమారు రూ.6.50 కోట్ల అంచనా వ్యయంతో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయనీ, వేములవాడ పట్టణంలో బ్యూటిఫికేషన్ పనుల కోసం రూ.2.60 కోట్లతో చర్యలు తీసుకున్నామని, సెంట్రల్ లైటింగ్ సిస్టం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. అలాగే అన్నదాన సత్రం పనులు రూ.35 కోట్లతో కొనసాగుతున్నాయని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బీమేశ్వర ఆలయాన్ని రూ.6 కోట్లతో ఆధునికరించినట్లు తెలిపారు.

బద్ది పోచమ్మ ఆలయం వద్ద కూడా పనులు వేగంగా జరుగుతున్నాయని, అక్కడి నిర్వాసితులకు సెటర్లు ఏర్పాటు చేసే పనులు త్వరలో పూర్తవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, మాజీ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు కొండా శేఖర్, అన్నారపు శ్రీనివాస్, కొక్కుల బాలకృష్ణ , తోటరాజు, నాయకులు కూరగాయల కొమురయ్య, సాగరం వెంకటస్వామి, సిరిగిరి శ్రీకాంత్, నాగరాజు ,తోట లహరి, పులి రాంబాబు, అనిల్, నాగుల విష్ణు, తదితరులు పాల్గొన్నారు..