ప్రీతిష్మితాకు పసిడి
24-05-2024 12:34 AM
ఐడబ్ల్యూఎఫ్ వరల్డ్ యూత్ చాంపియన్‌షిప్
లిమా (పెరు): ఐడబ్ల్యూఎఫ్ వరల్డ్ యూత్ చాంపియన్‌షిప్‌లో భారత యువ వెయిట్ లిప్టర్లు సత్తా చాటారు. మహిళల 40 కేజీల విభాగంలో 15 ఏళ్ల ప్రీతిష్మితా బోయ్ క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో పసిడి పతకం కొల్లగొట్టింది. ప్రీతిష్మితా మొత్తం 133 కేజీల బరువు ఎత్తి స్వర్ణం చేజెక్కించుకుంది. మన దేశానికే చెందిన సమర్ 125 కేజీలు (56+69) బరువు ఎత్తి రజతం సొంతం చేసుకుంది. టర్కీకి చెందిన ఫాత్మా కొల్కాక్ 120 కేజీలు ఎత్తి కాంస్యం సాధించింది. ఇక మహిళల 45 కేజీల విభాగంలో పాయల్ 147 కేజీల బరువు ఎత్తి రజతం సాధించింది. ఇక పురుషుల 49 కేజీల విభాగంలో 193 కేజీలు బరువును ఎత్తి బాబులాల్ హెమ్‌బ్రోమ్ కాంస్య తన ఖాతాలో వేసుకున్నాడు.






