calender_icon.png 1 August, 2025 | 5:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆటోలకు క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు

29-07-2025 12:10:16 AM

మహబూబాబాద్, జూలై 28 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా ప్రజలకు ఆటోల ద్వారా సురక్షితమైన ప్రయాణాన్ని అమలు చేయడానికి కొత్తగా క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు వేస్తామని మహబూబాబాద్ డిటిఓ జైపాల్ రెడ్డి, రూరల్ సిఐ సర్వయ్య, ట్రాఫిక్ ఎస్‌ఐ అరుణ్ కుమార్ తెలిపారు. సోమవారం ‘మై ఆటో ఇస్ సేఫ్’ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆదేశాల మేరకు ఆటో రిక్షా డ్రైవర్లతో క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు అమలు తీరుపై అవగాహన కల్పించారు.

క్యూఆర్ కోడ్ స్టిక్కర్ అమలు ద్వారా ట్రాఫిక్ నియమ నిబంధనలు సక్రమంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్క ఆటో యజమాని/డ్రైవర్ ఆధార్ కార్డు, వాహన రిజిస్ట్రేషన్ కార్డు, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, మొబైల్ ఫోన్ నెంబర్ టౌన్ పోలీస్ స్టేషన్లో అందజేసి క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులు, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.