బెల్లంపల్లి 100 పడకల ఆస్పత్రి సేవలు ఆదర్శనీయం
ప్రభుత్వ వైద్య ఆరోగ్య సంక్షేమ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రశంసలు
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ 100 పడకల ఆస్పత్రి అందిస్తోన్న వైద్య సేవలకు మరో సారి ప్రభుత్వం వైద్య శాఖ ప్రశంసలు అందుకుంది. ఆస్పత్రి సూపరింటెడ్ రవికుమార్ మార్గదర్శకత్వంలోవైద్య బృందం ప్రజలకు అంకితమైన మెరుగుగా అందిస్తోన్న వైద్య సేవలను గుర్తించారు.
తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ హైదరాబాద్ రవీంద్రభారతిలో మంగళవారం "ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఎన్.క్యు.ఎ.ఎస్ (నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ ) కింద ఆరోగ్య సంరక్షణ సేవలను బెల్లంపల్లి వైద్యశాల వైద్యులు అందించడంలో ఆదర్శప్రాయమైన పనితీరుకు ప్రశంసలు అందుకున్నారు. బెల్లంపల్లి ప్రభుత్వ 100 పడకల దావఖాన మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ రవికుమార్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ చేతుల మీదుగా ప్రశంసల పత్రాన్ని అందుకున్నారు.






