14 August, 2026 | 3:58 AM

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య

14-08-2026 01:22 AM

మున్సిపల్ చైర్మన్ దొంతగాని  

హుజూర్ నగర్, ఆగస్టు 13: ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యా లభిస్తుందని మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ అన్నారు. గురువారం పట్టణంలోని గోవిందపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేసి మాట్లాడారు. విద్యార్థులు చదువులతో పాటు క్రీడలను రాణించాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వ నూతన పాఠశాలల నిర్మాణానికి అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు జిల్లా రాష్ట్ర స్థాయిలో విద్యార్థులు రాణించాలని కోరారు. వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున రావు మాట్లాడుతూ... ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి పెద్దపెద్ద వేస్తుందన్నారు.

ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నారని అన్నారు. తల్లిదండ్రుల ఆశయాలను విద్యార్థులు నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కోలా ఉదయభాను, బోల్లెద్దు ధనమ్మ, నాగేశ్వరరావు, హెచ్‌ఎంలు గొట్టే శ్రీనివాస్ యాదవ్, దాడి నర్సిరెడ్డి, రేణుక, వీరస్వామి, శేఖర్, జనార్దన్ రెడ్డి, గొట్టేముక్కల రాములు పాల్గొన్నారు.