28 August, 2026 | 4:28 AM

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి

28-08-2026 12:00 AM

ఆసిఫాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. జనకాపూర్లోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు ఏకరూప దుస్తులు, బూట్లు, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, దుప్పట్లు పంపిణీ చేశారు.

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, ఇంగ్లీష్, గణితం, సైన్స్ను ప్రయోగాత్మకంగా బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, హాజరుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు, జి.సి.డి.ఓ. శకుంతల, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

వన మహోత్సవం లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలి

 వన మహోత్సవంలో జిల్లాకు కేటాయించిన మొక్కలు నాటే లక్ష్యాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె. హరిత సూచించారు. కలెక్టరేట్ ఆవరణలో జిల్లా అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం. డేవిడ్, జిల్లా రెవెన్యూ అధికారి దాసరి వేణుతో కలిసి మొక్కలు నాటారు.

ప్రభుత్వ భూములు, కార్యాలయాలు, విద్యాలయాలు, కాలువలు, చెరువు గట్లు, రహదారుల వెంట మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు, జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి, అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.