calender_icon.png 5 December, 2025 | 1:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూపాయి ఖర్చులేకుండా నాణ్యమైన విద్య

05-12-2025 12:47:15 AM

  1. జిల్లాలో విద్య ప్రమాణాలను పెంపొందించేందుకు సీఎం కృషి

జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు...

ఆదిలాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాం తి): ఆదిలాబాద్ జిల్లాలో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు ప్రజా పాలన ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారా వు అన్నారు. ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో గురువారం నిర్వహించిన కాంగ్రెస్ రెండేళ్ల ప్రజాపాలన విజయోత్సవ సభలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. పేదల పక్షపాతి అయిన ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తుందని మంత్రి తెలిపారు.

పేద విద్యార్థులు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా నాణ్యమైన విద్యను అందించేందుకు రూ.200 కోట్ల రూపాయల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసి విద్య ను అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రైతు సంక్షేమం లో భాగంగా గత సంవత్సరం పంట నష్టపోయిన రైతులకు  ఎకరానికి 10 వేల రూపా యల చొప్పున నష్టపరిహారం అందించడం జరిగిందని, ఈ సంవత్సరం జరిగిన నష్టంపై చర్యలు తీసుకుని రైతు సంక్షేమానికి కృషి చేస్తున్నామని తెలిపారు.

రైజింగ్ తెలంగాణ 2047 కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని ప్రజలందరి సమస్యల పరిష్కారానికి దూర దృష్టితో ప్రణాళిక రూపొందించి రాష్ట్రంలో లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులతో పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా సామాజిక, భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సీఎం ను కోరారు. జిల్లా అభివృద్ధికి కలిసి పని చేస్తామన్నారు.