2 April, 2026 | 12:33 AM

నాణ్యమైన పరుపులు దిండ్లు సరఫరా చేయాలి

07-12-2024 05:45 PM

ఆదేశించిన పిఓ రాహుల్...

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న ఆశ్రమ పాఠశాల, వసతి గృహాల్లో చదువుతున్న గిరిజన విద్యార్థిని విద్యార్థులకు చదువు, నాణ్యమైన భోజనంతో పాటు, వారికి మంచాలు, మెత్తనైనా పరుపులు, దిండులు సరఫరా చేయడం జరుగుతుందని, ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి బి. రాహుల్ అన్నారు. శనివారం  తన చాంబర్లో 50 ఆశ్రమ పాఠశాలలు, 13 వసతి గృహాలకు పరుపులు, దిండులు సరఫరా చేయుటకు టెండర్ బాక్స్ తెరిచి టెండర్ ప్రక్రియ ప్రారంభించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలకు, వసతి గృహాలకు పరుపులు, దిండులు  సరఫరా చేయడానికి  భద్రాచలం, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, అదిలాబాద్ నుండి పదిమంది ఏజెన్సీదారులు టెండర్లు దాఖలు చేశారని, టెండర్లలో చూపిన రేట్లు కాక అతి తక్కువ ధర కోడ్ చేసిన ఏజెన్సీలకు పరుపులు, దిండులు సరఫరా చేయడానికి కమిటీ సభ్యుల సమక్షంలో ఆమోదించడం జరిగిందని, టెండర్ సమయంలో చూపిన పరుపులు, దిండులు మాత్రమే ఆశ్రమ పాఠశాలలకు, వసతి గృహాలకు సరఫరా చేయాలని, నాసిరకమైన పరుపులు, దిండులు సరఫరా చేసినట్లు మా దృష్టికి వస్తే ఏజెన్సీలను రద్దు చేయడమే కాక శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. 

ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, డిఎంజిసిసి సమ్మయ్య, భద్రాచలం ఏటిడిఓ ఇంచార్జ్ నరసింహారావు, దమ్మపేట ఏ టి డి ఓ చంద్రమోహన్, ఇల్లందు ఏ టి డి వో రాధమ్మ, డి ఈ హరీష్ సిబ్బంది వెంకటరమణ, అశోక్ మరియు ఏజెన్సీల యజమానులు తదితరులు పాల్గొన్నారు.