2 April, 2026 | 2:19 AM

నెలాఖరులోగా ట్రైబల్ మ్యూజియం పూర్తి చేయండి

07-12-2024 05:51 PM

అధికారం ఆదేశించిన పిఓ రాహుల్...

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): గిరిజన తెగలకు సంబంధించి సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా స్టాల్స్ ఏర్పాటు చేసి వారి యొక్క కళాకృతులు అమ్మకాలు చేసుకొని జీవనోపాధి పెంపొందించుకోవడానికి మ్యూజియంను అన్ని హంగులతో సిద్ధం చేయాలని,  పనులన్నీ ఈనెల చివరికి పూర్తి చేయాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అధికారులను ఆదేశించారు. శనివారం ఐటీడీఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియం అభివృద్ధికి జరుగుతున్న పనులు, మట్టి నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసి గిరిజనుల ఆచార, వ్యవహారాలు సంస్కృతి, సంప్రదాయాలు, వారి యొక్క సాంప్రదాయకమైన గిరిజన వంటకాలు తయారుచేసి మ్యూజియం తిలకించడానికి వచ్చే యాత్రికులకు అందించడానికి నిర్మాణం చేపడుతున్న కుటీరాలు, పిల్లలు సరదాగా ఆడుకోవడానికి క్రీడా స్థలం ఏర్పాట్ల పనులు, బోటింగ్ సౌకర్యం కొరకు పనులు తొందరగా పూర్తి చేయాలని అన్నారు.

యాత్రికులు గిరిజనులకు సంబంధించిన వివిధ కళాకృతులతో సెల్ఫీలు, ఫోటోలు దిగడానికి ప్రత్యేకంగా హాలు ఏర్పాటు చేయాలని, అలాగే బయటివారు మ్యూజియం వచ్చే జనాలకు వివిధ రకాల ఆహార పదార్థాలు అమ్మకాలు జరుపుకోవడానికి వారికి సపరేటుగా స్టాల్స్ ఏర్పాటు చేయాలని, మ్యూజియం వెనుక భాగాన వెదురు యొక్క ప్లాంటేషన్ నిర్మాణం చేపట్టాలని అన్నారు. అలాగే గిరిజనుల యొక్క పాతకాలపు వేటాడే వస్తువులను, ఆర్చరీ, ఇతర వస్తువులు చిన్నపిల్లలు ఆడుకోవడానికి అణువుగా ఉండేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. భక్తులకు సులభంగా తెలిసే విధంగా మ్యూజియం ఎంట్రెన్స్ నుండి మ్యూజియం వరకు పూర్తిస్థాయిలో విద్యుత్ లైట్లు అమర్చాలని చూపరులకు కనువిందు కలిగేలా మ్యూజియంను అందంగా తీర్చిదిద్దాలని ఆయన అన్నారు. 

అనంతరం ట్రైబల్ మ్యూజియంను సందర్శించి యాత్రికులకు అనుకూలంగా ఉండేలా గిరిజన వంటకాలు తయారు చేసే మట్టితో కట్టే వంట ఇల్లు, ప్లాంటేషన్ ఏర్పాట్లు, కూర్చోవడానికి కుర్చీలు, సోఫాలు, పిల్లలు ఆడుకునే ఆట వస్తువుల ఏర్పాట్ల పరిసరాలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఎఫ్ డి సి ఉదయ్ కుమార్, డి ఈ హరీష్, గ్రామపంచాయతీ ఈవో శ్రీనివాస్, మ్యూజియం ఇంచార్జ్ వీరాస్వామి, మట్టి, వెదురుతో వివిధ స్టాల్స్ ఏర్పాటు చేసే డిజైనర్లు శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.