సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రెండవ రోజు నిరసన దీక్ష
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర శిక్షఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన శనివారానికి రెండో రోజుకు చేరుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ వద్ద దీక్ష శిబిరానికి రాష్ట్ర సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఝాన్సీ సౌజన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత సంవత్సరం ప్రతిపక్ష హోదాలో పిసిసి అధ్యక్షునిగా గౌరవ రేవంత్ రెడ్డి హనుమకొండ సమగ్ర శిక్ష ఉద్యోగుల ధర్నా శిబిరానికి విచ్చేసి మీ సమస్యను మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే తీరుస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అందుకోసం ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటు వంటి అధికారులకు అనధికారులకు రాష్ట్ర పార్టీ మంత్రులకు వేడుకున్నప్పటికీ కనీసం స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఈసారి చేసే దీక్షతోనే ప్రభుత్వం స్పందించి మన సమస్యకు తప్పనిసరిగా పరిష్కారం చూపిస్తుందని ఆశిస్తున్నాను అని, లేని పక్షంలో ఈ నెల 10వ తేదీ నుండి పూర్తి స్థాయి సమ్మె చేస్తామని హెచ్చరించారు. TSTTF రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ ఈ దీక్ష శిబిరానికి విచ్చేసి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మోహన్ భూక్యా, ప్రధాన కార్యదర్శి భట్టు చందర్ లాల్, కోశాదికరి కిషన్ సలహాదారులు వనమా సురేష్ జిల్లాలోని అన్ని వింగుల సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు.




