24 June, 2026 | 1:03 AM

రైతు వేదికల్లో నాణ్యమైన విత్తనాలు

24-06-2026 12:00 AM
  1. నేటి నుంచి ఆరు కేంద్రాల్లో విత్తనాలు
  2. వ్యవసాయ శాఖ అధికారులు

భీమదేవరపల్లి, జూన్ 23 (విజయక్రాం తి) : రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు విజ్ఞప్తి చేశారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులోని రైతు వేదికలో విత్తనాల మేళాను ముల్కనూర్ సర్పంచ్  ప్ర మోద్ రెడ్డి ప్రారంభించారు. రైతులకు ఏడు రకాల విత్తనాలు ఆర్‌ఎన్‌ఆర్, 1548, హెచ్‌ఎంటి, సోనా, జైశ్రీరామ్, వరంగల్ 44, 15 48 విత్తనాలను అందుబాటులో రైతువేదికలలో ఉంటాయని భీమదేవరపల్లి వ్యవసా య అధికారి పద్మ వెల్లడించారు.

నేటి నుంచి మల్లారం ,కొత్తపల్లి, గట్ల నర్సింగాపూర్ ,రత్నగిరి, మల్లారం, వంగర గ్రామాల్లోని రైతు వేదికల్లో వరి విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంటాయన్నారు.  కార్యక్రమంలో ముల్కనూర్ సహకార బ్యాంకు అధికారులు ఏవో అచ్యుత్ రెడ్డి, డి స్వామి రావు, ఏఏవో సాయి కృష్ణ,  వ్యవసాయ శాఖ అధికారులు కమలహాసన్, రవితేజ, నాగరాజు, క్రిసోలైట్, శైలజ, మౌనిక, రైతులు పాల్గొన్నారు.