24 June, 2026 | 2:04 AM

ఉపాధ్యాయుల సర్దుబాటు

24-06-2026 12:00 AM

అవసరమున్న చోటుకి పంపేలా విద్యాశాఖ ఆదేశాలు

హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల సర్దుబాటు ప్రక్రియను చేపట్టనున్నారు. రిటైర్‌మెంట్, దీర్ఘకా లిక సెలవులు, ఇతర కారణల వల్ల ఏర్పడ్డ ఖాళీలతో మిగులు ఉపాధ్యాయులను అవసరమున్న సూళ్లకు పంపాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులు తక్కువగా ఉండి ఉపాధ్యాయు లు ఎక్కువగా ఉన్న పాఠశాలల నుంచి విద్యార్థులు ఎక్కువగా ఉండి ఉపాధ్యాయులు తక్కువగా ఉన్న సూళ్లకు డిప్యూటేషన్ కింద పంపించాలని కలెక్టర్లు, డీఈవోలను ఆదేశించారు.