24 June, 2026 | 2:03 AM

ఇడమయ్యకు చేయూత

24-06-2026 01:01 AM

కృత్రిమ కాలుకు హామీ. పింఛను మంజూరుకు చర్యలు.

చర్ల: జూన్ 23, (విజయక్రాంతి): మండలంలోని మారుమూల బక్కచింతలపాడు గ్రామానికి చెందిన ఇడమయ్య దుస్థితి పలువురి హృదయాలను కదిలించింది. రెండు కాళ్లు కోల్పోయి, చేతులు కూడా సరిగా సహకరించని ఆయన పరిస్థితిపై స్పందించిన దాతలు ఆర్థిక సాయం అందించారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చీమలమర్రి మురళీకృష్ణ చేతుల మీదుగా ఇడమయ్య, సుశీల దంపతులకు నగదు అందజేశారు. 

 విరాళాలు ప్రకటించిన దాతలు 

రూ.10,000:  కాముని శివరామకృష్ణ, హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఉద్యోగ- రూ.5,000:  సిహెచ్ సతీష్ కుమార్, హైకోర్టు న్యాయవాది - రూ5,000: అనిల్ రెడ్డి, టీవీ9 రిపోర్టర్ - రూ.2,000:  ఎడారి భూపతి   మొత్తం: రూ.22,000. అందజేశారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ, కష్టకాలంలో ఆదుకున్న దాతల దాతృత్వాన్ని కొనియాడారు. భద్రాచలం ప్రముఖ సామాజికవేత్త బిర్రు సుధాకర్ ఇడమయ్యకు కృత్రిమ కాలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారని తెలిపారు. ఇడమయ్యకు వికలాంగుల పింఛను మంజూరు కోసం స్థానిక ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు దృష్టికి తీసుకెళ్లినట్లు మురళీకృష్ణ వెల్లడించారు. ఇంకా పలువురు దాతలు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆదుకున్న అందరికీ ఇడమయ్య కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.