24 June, 2026 | 1:03 AM

డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళి

24-06-2026 12:00 AM

కూకట్‌పల్లి, జూన్ 23 (విజయక్రాంతి): భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా మంగళవారం బిజెపి రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ఆయన కార్యాలయంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సమగ్రత, ఐక్యత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానేత డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. భారతీయ జనసంఘ్ స్థాపన ద్వారా దేశంలో జాతీయ వాద ఆలోచనలకు బలమైన పునాది వేశారన్నారు. దేశం కోసం ఆయన చేసిన త్యాగాలు, పోరాటాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అన్నారు.

ఆయన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనందరి బాధ్యతన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబిసి నాయకులు పులిగోటి శ్రీనివాస్ యాదవ్, చేదురుపల్లి శ్రీనివాస గౌడ్, కూకట్పల్లి అసెంబ్లీ ఓ బి సి కో కన్వీనర్ సతీష్ గౌడు, కూకట్పల్లి డివిజన్ బిజెపి నాయకులు అనంత నాగరాజు, శంకర్ రెడ్డి, ఫణీంద్ర శర్మ, గౌల ఆనంద్, ఫతేనగర్ డివిజన్ బిజెపి నాయకులు శశి కిరణ్ గౌడ్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.

శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ దేశ ఐక్యత కోసం జీవితాన్ని త్యాగం చేశారు 

రాజేంద్రనగర్, జూన్ 23 (విజయక్రాంతి): భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ దేశ ఐక్యత, సమగ్రత కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని బండ్లగూడ జాగీర్ బీజేపీ అధ్యక్షుడు బి. మహేష్ యాదవ్ కొనియాడారు. మంగళవారం శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా కాళీ మందిర్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి బీజేపీ శ్రేణులు ఘన నివాళులర్పించాయి. మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖర్జీ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నీరుడు పవన్ సాయి, నిరుడు శేఖర్ ముదిరాజ్, దామోదర్ రెడ్డి, వెంకటేష్, నరేష్ యాదవ్, శేఖర్ రెడ్డి, నాగరాజు, హర్ష రెడ్డి, లక్ష్మణ్, శ్రీకాంత్, వినయ్ పాల్గొన్నారు.