13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

బంకుల వద్ద బారులు

26-03-2026 01:26 AM

శంకర్ పల్లి, మొయినాబాద్, చేవెళ్ల, మార్చి 25( విజయక్రాంతి): సరఫరా లోపం మరియు సోషల్ మీడియాలో వస్తున్న పుకార్ల నేపథ్యంలో చేవెళ్ల నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఇంధన కొరత ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు బంకుల వద్ద గంటల తరబడి బారులు తీరుతున్నారు. 

కొరత కారణంగా పెట్రోల్ దొరకదనే భయంతో ప్రజలు ప్లాస్టిక్ క్యాన్లు, డబ్బాల్లో ఇంధనాన్ని నిల్వ చేసుకునేందుకు ఎగబడుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా బైక్లు, కార్లు, సరుకు రవాణా వాహనాలు క్యూ లైన్లలో వేచి చూస్తున్నాయి. 

కొన్నిచోట్ల ’నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. 

ఉన్న నిల్వలను అందరికీ అందించాలనే ఉద్దేశంతో బంకు నిర్వాహకులు పరిమితంగానే ఇంధనాన్ని సరఫరా చేస్తున్నారు. దీనివల్ల అత్యవసర ప్రయాణాలు చేసే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్యూ లైన్లలో ఎదురుచూపులు భరించలేక వాహనదారుల మధ్య వాగ్వాదాలు చోటుచేసు కుంటున్నాయి. సిఎన్జి (CNG) వాహనదారుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయని అధికారులు చెబుతున్నప్పటికీ, ప్రజల్లో ఉన్న ఆందోళన తగ్గడం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి సరఫరాను క్రమబద్ధీకరించాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.