పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
మేడ్చల్ బీబ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్
ఘట్ కేసర్, మార్చి. 25 (విజయక్రాంతి): పేదల సంక్షేమమే కాంగ్రెస్ సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మేడ్చల్ నియోజకవర్గం బిబ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ అన్నారు. ఘట్కేసర్ సర్కిల్, ఎదులాబాద్ 7వ డివిజన్, పరిధిలోని ఘనపురం, లింగాపురం, పకీర్ టేక్య తండాలోని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయిన లబ్ధిదారుల ఇంటి నిర్మాణం కోసం గురువారం ఇండ్ల నిర్మాణం కోసం ముగ్గుపోయు కార్యక్రమంలో మహేష్ గౌడ్ పాల్గొని కొబ్బరికాయ కొట్టి, భూమిపూజ చేశారు. ఈ సందర్బంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లను ప్రజా ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు.
నిర్ణీత కాల వ్యవధిలో ప్రభుత్వ నిబంధనల మేరకు ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకోవాలని, ఇండ్లు మంజూరైన ప్రతి ఒకరు ఇండ్లు కట్టుకొని తమ సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఘనపురం గ్రామ మాజీ సర్పంచ్ లు ననావత్ రూప్ సింగ్ నాయక్, వేముల మమత గౌడ్, గ్రామ కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు వేముల రాజు గౌడ్, ఇందిరమ్మ కమిటి సభ్యులు గుర్జకుంట నర్సింహా, బర్ల అనీత, పైళ్ల లతరెడ్డి, మాజీ వార్డు సభ్యులు ననావత్ సురేష్ నాయక్, నాయకులు తాటికొండ మల్లేష్ గౌడ్, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.




