విద్యార్థులను పరామర్శించిన అధికారులు, కాంగ్రెస్ నాయకులు
బాన్సువాడ, జూలై 6 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో ఆదివారం రాత్రి భోజనం చేసిన అనంతరం పలువురు విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు.
వెంటనే పాఠశాల యాజమాన్యం వారిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నరూ. ఈ విషయం తెలుసుకున్న ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, బీర్కూర్ ఉప సర్పంచ్ పరమేష్ పంతులు కాంగ్రెస్ నాయకులు ఎజాజ్, శశికాంత్ లు ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. అనంతరం వైద్య సిబ్బందితో మాట్లాడి విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చికిత్స అందించాలని సూచించారు. విద్యార్థులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తు,తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.






