రాధాకిషన్‌రావు బెయిల్ పిటిషన్ కొట్టివేత
03-05-2024 12:56 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 2 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు రాధాకిషన్‌రావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. రాధాకిషన్‌రావు బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసిన పంజాగుట్ట పోలీసులు, కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వొద్దని న్యాయస్థానానికి వివరించారు. పోలీసుల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం గురువారం రాధాకిషన్‌రావు బెయిల్‌ను తిరస్కరించింది. కాగా, గత వారం ఈ కేసులో నిందితులుగా ఉన్న ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నలు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.




