1 April, 2026 | 5:44 PM

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్

03-05-2024 12:58 AM

9 వరకు నామినేషన్ల స్వీకరణ

13 వరకు ఉపసంహరణ 27న పోలింగ్

హైదరాబాద్, మే2 (విజయక్రాంతి): వరంగల్ నల్ల గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు గురువారం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 9 వరకు గడు వు ఉంది. అభ్యర్థులు నల్లగొండ జిల్లాకేంద్రంలోనే రిటర్నింగ్ అధికారి, కలెక్టర్‌కు నామినేషన్లు అం దించాల్సి ఉంటుంది. 10న నామినేషన్ల స్క్రూట్నీ ఉంటుంది. 13వ తేదీ నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు చివరి గడువు. వచ్చే నెల 27న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ ఎమ్మె ల్సీ స్థానంలో పోటీ చేసి గెలిచిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో  జనగామ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.