1 April, 2026 | 9:32 PM

ఇంద్రకరణ్‌ది నీతిమాలిన పని

03-05-2024 12:55 AM

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్

హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్‌ఎస్ హయాం లో మంత్రిగా పదవులు అనుభవించి, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పు డు కాంగ్రెస్‌లో చేరడం తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లుగా ఉందని మండిపడ్డారు. గురువారం మాట్లాడుతూ.. ఇంతకన్న నీతిమాలిన, సిగ్గుమాలిన చర్య ఉండదని దుయ్యబట్టారు. జిల్లాలో రెండుసార్లు మంత్రిగా అవకాశం ఇచ్చా రని, 75 ఏళ్ల వయస్సులో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి ఆయన చేసేది ఏమిటని ప్రశ్నించారు.

మంత్రిగా ఉద్య మకాలం నుంచి ఉన్నవారికి రాని అవకాశం ఇంద్రకరణ్‌రెడ్డికి కల్పించారని తెలిపారు. కేసీఆర్ ఆయన ను ఎంతో ఆదరించారని, నేడు పార్టీకి ద్రోహం చేశారని ఆయనకు జిల్లా ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. కాంగ్రెస్‌ను నామరూపాలు లేకుండా చేయాలని విమర్శ లు చేసిన వారిని చేర్చుకుని ఆ పార్టీ మలినపడిందన్నారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు, పదేండ్లు ప్రతిపక్షంలో ఉండి పార్టీ కోసం కష్టపడవారి హృదయాలు బాధపడుతున్నాయని పేర్కొన్నారు.