13-09-2025 03:33:54 AM
-రాష్ట్రపతిద్రౌపది ముర్ము చేతుల మీదుగా..
-హాజరైన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా తదితరులు
-హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్ భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో అట్టహా సంగా జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన వహించి, నూతన ఉపరాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మాజీ ఉపరాష్ట్రపతులు జగదీప్ ధన్‌ఖడ్, హమీద్ అన్సారీ, వెంకయ్యనాయుడు, పలువురు కేంద్రమంత్రులు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులు హాజరయ్యారు. ఉపరా ష్ట్రపతిగా రాజీనామా చేసిన నాటి నుంచి బయట కనిపించని మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ కూడా ఈ ప్రమాణస్వీకార మహోత్సవానికి హాజరయ్యారు.
ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసే ముందే రాధా కృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్‌గా రాజీనామా చేయగా.. ఆ రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ బాధ్యతలను గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్‌వ్ర త్‌కు అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం రాధాకృష్ణన్ ప్రధాని, ఇతర నేతలతో ప్రత్యేకంగా సమావేశం అ య్యారు.
రాజ్‌ఘాట్, సదైవ్ అటల్, కిసాన్ ఘాట్‌లకు వెళ్లి నివాళులు అర్పించారు. పార్లమెంట్ ప్రాంగంణంలో ఉన్న ప్రేరణ స్థల్‌కు కూడా వెళ్లారు. పార్లమెంట్‌లో రాధాకృష్ణన్‌కు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరి వంశ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మం త్రి కిరణ్ రిజిజు తదితరులు ఘన స్వాగతం పలికారు.