calender_icon.png 13 September, 2025 | 2:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుమల శ్రీవారి సన్నిధిలో నిర్మల

13-09-2025 03:32:44 AM

భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించిన కేంద్ర మంత్రి

తిరుమల, సెప్టెంబర్12: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం తిరుమలలో పర్యటించారు. ఆమె తిరుమలలో సామాన్య భక్తురాలిగా మారి పోయా రు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని సందర్శించి భక్తులను అప్యాయం గా పలకిరిస్తూ వారికి స్వ యంగా అన్నప్రసాదాన్ని వడ్డించి ఆశ్చర్యపరిచారు.

కేవలం వడ్డించడమే కాకుండా, భక్తుల పక్కన కూ ర్చుని అన్నప్రసాదాన్ని ఆమె స్వీకరించారు. అలాగే టీటీడీ అందిస్తున్న భోజనం రుచి, నాణ్యత ఎలా ఉన్నాయని పలువురు భక్తులను అడిగి తెలుసుకున్నారు. టీటీడీ అందిస్తున్న అన్నప్రసాదంపై భక్తులు పూర్తి సం తృప్తిని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సీతారామన్ మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు అం దిస్తున్న సేవలు అద్భుతమని కొనియాడారు. ఇంత పెద్ద సంఖ్యలో భక్తులకు నాణ్య మైన భోజనాన్ని ఉచితంగా అందించడం ఆధ్యాత్మిక సేవకు గొప్ప నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. కేంద్ర మంత్రి వెంట టీటీడీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.