13-09-2025 03:35:23 AM
-మణిపూర్ అల్లర్ల అనంతరం మొదటిసారి రాష్ట్ర పర్యటనకు మోదీ..
-పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఇంఫాల్, సెప్టెంబర్ 12: మణిపూర్ అల్లర్ల చోటు చేసుకున్న అనంతరం తొలిసారి ప్రధాని మోదీ శని వారం ఆ రాష్ట్ర పర్యటనకు వెళ్తున్నా రు. ప్రధాని పర్యటన నేపథ్యంలో మణిపూర్‌లో అన్ని ఏర్పాట్లు చేశా రు. ఈ పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.
మణిపూర్ సీ ఎస్ పునీత్ కుమార్ గోయల్ ప్రధా ని పర్యటన వివరాలు తెలిపారు. చు రాచంద్‌పూర్‌లోని స్టేట్ పీస్ గ్రౌండ్ కు సెప్టెంబర్ 13న 11.30కి ప్రధాని మోదీ చేరుకుంటారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకు స్థాపన చేసిన అనంతరం ప్రజలను ఉద్దేశిం చి ప్రసంగిస్తారు.
మధ్యాహ్నం 2 గం టల వరకు ఇంఫాల్‌లోని కాంగ్లాకు చేరుకుని ఘర్షణల వల్ల ఆశ్రయం కోల్పోయిన వారితో ప్రధాని సంభాషిస్తారు. ఈ పర్యటనలో మణిపూర్ రా ష్ట్రంలో రూ.7,300 కోట్ల విలువైన పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. మణిపూర్ పర్యటకు ముందు మిజోరాం రాష్ట్రం లో పర్యటించి బైరబి రైల్వే లైన్‌ను ప్రారంభిస్తారు. ఈ రైల్వే లైన్‌తో ఈశాన్య రాష్ట్రాలకు మరింత కనెక్టివిటీ పెరగనుంది.
అదేం పెద్ద విషయం కాదు.. ఓట్ చోరీయే ప్రధాన సమస్య: రాహుల్ గాంధీ
ప్రధానమంత్రి మోదీ పర్యటనపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ‘మణిపూర్ సమస్య ఎన్నో రోజులుగా ఉంది. ఆయన అక్కడికి వెళ్లడం మంచి దే. కానీ ప్రస్తుతం దేశంలో ఓట్ చోరీయే ప్రధాన సమస్య. హర్యానా, మహారాష్ట్రల్లో జరిగిన ఎన్నికల్లో ఓట్లు చోరీ చేశారు. ప్రజలు ఎక్కడ చూసినా ఓట్ చోరీ గురించే మాట్లాడుతున్నారు’ అని రాహుల్ గాంధీ ప్రధాని పర్యటనపై వ్యంగంగా స్పందించారు.