09-02-2026 12:45:47 AM
హనంకొండ, ఫిబ్రవరి 8 ( విజయ క్రాంతి): యువత ఉన్నతమైన లక్ష్యాలతో సామాజిక సేవలో ముందుండాలని కాకతీయ విశ్వవిద్యాలయ రిటైర్డ్ ప్రొఫెసర్ గడ్డం భాస్కర్ అన్నారు. కె.యు ఉద్యోగుల కాలనీలో ధర్మసేతు గ్లోబల్ వెల్ఫేర్ సొసైటీ సామాజిక సంస్థను రిటైర్డ్ ప్రొఫెసర్ గడ్డం భాస్కర్ ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో పేద, మధ్యతరగతి ప్రజలు, యువకులు మహిళల సామాజిక, ఆర్థిక,విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలకు సంబంధించిన విషయాలలో ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వాటి తీవ్రతను కొంతవరకైనా తగ్గించాలనే ఉద్దేశంతో సామాజిక సేవ చేయాలని, ఆరోగ్యం,విద్య నైపుణ్యం,
ఉపాధి అవకాశాలపై అవగాహన సదస్సులు శిక్షణ కార్యక్రమాలు మహిళా సాధికారత కొరకు ఆదర్శవంతమైన కార్యక్రమాలను చేపట్టాలనే లక్ష్యంతో, గ్రామస్థాయి నుండి ప్రపంచ స్థాయి పోటీలో నిలతొక్కుకునే విధంగా యువతకు విద్య,ఉపాధి అవకాశాల గురించి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావడం మొదలైన లక్ష్యాలతో ఈ సంస్థ ఏర్పాటయిందన్నారు.
సంస్థ అధ్యక్షులు ఎలగంటి శ్రీకాంత్ మాట్లాడుతూ కాలనీ పెద్దల సహాయ సహకారాలతో సామాజిక సేవ చేయాలనే ఉద్దేశంతో మిత్రుల సహకారంతో గ్లోబల్ వెల్ఫేర్ సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందనీ, ఉచిత ఆరోగ్య శిబిరానికి సూపర్ స్పెషాలిటీ డాక్టర్లైన డాక్టర్ భార్గవ్ వెంపటి, న్యూరాలజీ డాక్టర్ శ్రీ పాల్ చెన్నం, ఆర్తో డాక్టర్ జి మానస, జనరల్ మెడిసిన్ డాక్టర్ పి కావ్య గైనిక్, ఓబీజీ డాక్టర్ సాయి తేజ రెడ్డి డెర్మటాలజీ అండ్ కాస్మాటోలోజి హాజరై విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సంస్థ ఏర్పాటు చేసిన సందర్భంగా శ్రేయోభిలాషులు సామాజిక కార్యకర్తలు ఎంఎన్ మూర్తి, బొనగాని యాదగిరి గౌడ్, మౌనిక, కాలనీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, రామచంద్రారెడ్డి, కేయూ రిటైర్డ్ ఉద్యోగస్తులు గుండు చంద్రమౌళి,సుందర్, డా. ఏ నాగేశ్వరరావు, తాళ్లపల్లి రామస్వామి గౌడ్, ఫార్మసి స్టాప్ మరియు సేవా సంస్థ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.