10-11-2025 12:00:00 AM
జూనియర్లకు వివాహ తంతు జరిపించి పైశాచిక ఆనందం పొందిన సీనియర్లు
మల్యాల, నవంబర్ 9 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలోని నాచుపల్లి జెఎన్టీయూలో ర్యాగింగ్ కలకలం రేపింది. పరిచయ కార్యక్రమం పేరుతో సీనియర్ విద్యార్థుల పైశాచికత్వం బయటపడింది. జగిత్యాల ఎస్పీ రెండు రోజుల క్రితం కాలేజీని సందర్శించి ర్యాగింగ్‌కి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని హితబోధన చేసిన ముందు రోజే ర్యాగింగ్ ఘటన జరిగింది. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
జూనియర్ విద్యార్థుల్లో ఇద్దరు మగవారికి వివాహం తంతు జరిపించారు. మాంగళ్య ధారణ చేయించడం, అరుంధతి నక్షత్రం చూపించారు. ఈ తంతు అంతా వీడియో తీయడంతో అది బయటకు వచ్చింది. కొంతమంది విద్యార్థులను చున్నీలతో ఓణీ కట్టుకుని డ్యాన్సులు చేయించి, జూనియర్లను వేధింపులకు గురి చేసినట్టు ఆ వీడియో ఉన్నది. అయితే ఈ ర్యాగింగ్‌పై పోలీసులకు, కాలేజీ ఉన్నతాధికారులకు ఎలాంటి ఫిర్యాదులు రానట్టుగా తెలుస్తోంది.