10-11-2025 12:00:00 AM
తూప్రాన్, నవంబర్ 9 :తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు పడాలపల్లిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మట్టెల హరీష్ యాదవ్ కు మాజీ సర్పంచ్ బొంది వెంకట్ గౌడ్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. అనారోగ్య నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందగా సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తు చేసుకొన్నారు. బొంది వెంకట్ గౌడ్ ప్రోద్బలంతో చెక్కు మంజూరు కాగా చెక్కును బాధిత కుటుంబానికి అందించారు. ఈ కార్యక్రమంలో పడాలపల్లి గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.