7 April, 2026 | 7:43 AM

రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలి

07-05-2024 01:04 AM

మాజీమంత్రి చామకూర మల్లారెడ్డి 

మేడ్చల్, మే 6 (విజయక్రాంతి) : మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మేడ్చల్ జిల్లా గిర్మాపూర్‌లోని బీరప్ప ఆలయంలో ఆయన ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి పూజలు చేసిన అనంతరం ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటికి తిరుగుతు కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.