11 March, 2026 | 11:25 PM

మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం

30-11-2025 12:00 AM
  1. నలుగురు విద్యార్థుల సస్పెండ్

మొదటి సంవత్సరం విద్యార్థితో గోడకుర్చీ వేయించిన సీనియర్లు  

నాగర్ కర్నూల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

నాగర్ కర్నూల్, నవంబర్ 29 (విజయక్రాంతి):నాగర్ కర్నూల్ జిల్లా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం తీవ్ర కలకలం రేపుతోంది. మెడికల్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ద్వితీ య సంవత్సరం చదువుతున్న నలుగురు విద్యార్థులు గోడకుర్చీ వేయించి ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. ఈ ఘటన గత 15 రోజు ల క్రితం జరగగా ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది.

దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కళాశాల క్రమశిక్షణ కమిటీ విచారణ చేపట్టి విద్యార్థులు హేమంత్ చారి, దీపక్ శర్మ, కిషన్, అలోగనిలపై కాలేజీ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేసినట్లు మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అరుం ధతి తెలిపారు.