22 July, 2026 | 3:32 AM

మారథాన్ నిర్వహణలో రాగ్‌పికర్స్ కృషి

27-08-2024 01:07 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 26 (విజయక్రాంతి): పరిశుభ్రమైన మారథాన్ నిర్వహణ కోసం రాగ్ పికర్స్ కృషి మరువలేనిదని ఎన్‌ఎండీసీ హైదరాబాద్ మారథాన్ నిర్వాహకులు అన్నారు. హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న మారథాన్‌లో రాగ్ పికర్స్ సేవలను వినియోగించుకున్నట్లు చెప్పారు. రేస్ డైరెక్టర్ రాజేష్‌వెచ్చా ఆధ్వర్యంలో సరూర్‌నగర్ సింగరేణి కాలనీలో రాగ్‌పికర్స్‌కు సోమవారం టీషర్టులు, అల్పాహారం అందించారు.