20 June, 2026 | 2:41 AM

గాంధీభవన్‌లో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

20-06-2026 12:00 AM

నోటు పుస్తకాల పంపిణీ చేసిన మెట్టు సాయికుమార్

హైదరాబాద్, జూన్ 19(విజయక్రాంతి): లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు చేతుల మీదుగా నిరుపేద కుటుంబాల విద్యార్థులకు నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని రాహుల్ గాంధీ సమాజ సేవా దృక్పథాన్ని కొనియాడారు. విద్యార్థులకు విద్య ఎంతో ముఖ్యమని, ఆర్థిక ఇబ్బందులు వారి చదువులకు అడ్డంకి కా కూడదనే ఉద్దేశంతో నోట్ పుస్తకాల పంపిణీ చేపట్టినట్లు మెట్టు సాయికుమార్ తెలిపారు. రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజా సంక్షేమం కోసం ఆయ న మరింత కాలం సేవలందించాలని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికు మార్ ఆకాంక్షించారు.